04-05-2025 12:00:00 AM
అతిపెద్ద వజ్రం
వజ్రాల గనులకు ఆఫ్రికన్ దేశాలు తరతరాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే బోట్స్ వానా గనుల్లో ఇటీవల ఓ వజ్రం బయటపడింది. 1,098 క్యారెట్ల బరువుతో ఆశ్చర్యపరుస్తుంది. మానవ చరిత్రలో ఇప్పటి వరకూ జరిగిన గనుల తవ్వకాల్లో బయటపడిన మూడో అతిపెద్ద వజ్రం ఇదేనని పరిశోధకులు తేల్చారు. అక్కడి జ్వేనెంగ్ వజ్రపు గని ఈ వింతకు చిరునామాగా నిలిచింది.
గోడల మధ్య భూమి
లండన్ లోని ’గయా‘ ను వర్ణించడానికి మాటలు చాలవు. ఆర్టిస్టు లూకె జెర్రామ్ అచ్చంగా భూమిని దించేశాడు. నాసా ఇమేజిలను ఫాలోకావడం వల్ల కచ్చితత్వం కనిపిస్తుంది. అక్కడి ఓల్డ్ రాయల్ నావెల్ కాలేజీలోని పెయింటెడ్ హాల్లో వేలాడదీశాడు. అది చూస్తే గోడల మధ్య నేలని బంధించిన ఫీలింగ్ వస్తుంది.
ప్రతిఘటన
బ్రెజిల్ అనగానే అమెజాన్ రైన్ ఫారెస్ట్, అక్కడ నివసించే అనేక జాతుల వారు గుర్తుకువస్తారు. అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో గద్దెదిగాలని ఇటీవల అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు తెలియజేశారు. అందులో అనేకమంది ఆదిమజాతి వారూ పాల్గొన్నారు.
తుక్కు అడవులు
పాడై పోయిన లారీలు, ట్రక్కులను సాధారణంగా పక్కన పడేస్తాం. కానీ ఆర్టిస్ట్ డేన్ రాలింగ్స్ మాత్రం అలాంటివి ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటాడు. ఆ తుక్కు వాహనాలపై అడవులను చెక్కుతాడు. వాహనాలపై లతలూ, కొమ్మలతో చెట్లను తీర్చిదిద్దడం చాలా కష్టం. ఒక్కోదానికి నాలుగు నెలల సమయం పడుతుంది. కానీ డేన్ రాలింగ్స్ కి అదే మహా సరదా. ఏదైనా తిరిగి ప్రకృతిలోకి వెల్లవలసిందే అనే సందేశం ఇస్తున్నాడు తను.