04-05-2025 12:00:00 AM
* కిచెన్‌లో నూనె వొలికిపోతే వెంటనే వొలికిన నూనె మీద గోధుమ పిండి చల్లాలి. ఐదు నిమిషాల తర్వాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డులేకుండా శుభ్రం పడుతుంది.
* కూర అడుగంటినప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్‌ను వేసి కరిగేంత వరకు తిప్పాలి. ఇలా చేస్తే పాత్రకు అంటుకున్నది విడిపోయి కూర అడుగంటకుండా ఉంటుంది.
* వెల్లుల్లిపాయలకు కొద్దిగా వైట్ వెనిగర్ రాసి నిల్వచేస్తే పాడవకుండా ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంటాయి.
* అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజిలో కాస్త తేనె, నారింజ రసం లేదా కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తాగితే రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.
* పూరీలు బాగా పొంగాలంటే.. గోధుమ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ లేదా బియ్యపు పిండి కలపాలి.
* చపాతీలు తెల్లగా మెత్తగా ఉం డాలంటే పిండిలో రెండు చెంచాల పాలు, ఒక చెంచా పాలు, ఒక చెంచా బియ్యం పిండి, కొంచెం నూనె వేసి ఐస్ వాటర్‌తో పిండిని కలపాలి.