2 March, 2026 | 2:45 AM

స్థానిక వ్యాపారులకు ‘డిజిటల్’ బలం

02-03-2026 12:59 AM
  1. ‘జస్ట్‌బాట్’తో కొత్త దిశలో ధాట్‌వీ బిజినెస్ సొల్యూషన్స్
  2. టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాల్లో సమాన అవకాశాల లక్ష్యంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరణ
  3. టెక్నాలజీ ప్రపంచంలో వేగం, విస్తరణ, స్థిరత్వం కీలకం
  4. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి) : వేగం, విస్తరణ, స్థిరత్వం నేటి టెక్నాలజీ ప్రపంచంలో కీలక అంశాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ‘జస్ట్‌బాట్’ స్థానిక వ్యాపారుల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని క్విక్ కామర్స్ రం గంలో ప్రవేశించడం అభినందనీయమన్నా రు. ధాట్‌వీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఫ్లాగ్ షిప్ క్విక్ కామర్స్ బ్రాండ్‌గా ‘జస్ట్‌బాట్’ను ఆదివారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ర్స్ ఇప్పుడు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాల్లో వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలు, కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారని, ‘జస్ట్‌బాట్’ వంటి ప్లాట్ ఫారములు వారికి కొత్త శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు. ధాట్‌వీ బిజినెస్ సొల్యూషన్స్ భవిష్యత్తులో తెలంగాణ నుంచి ఎదిగే డిజిటల్ కామర్స్ సంస్థగా మారి యూనికార్న్ స్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంస్థ డైరెక్టర్ జే.నా గమణి మాట్లాడుతూ... మన సమాజానికి వెన్నెముకైన చిన్న రిటైలర్లను రక్షించడం, సాధికారత కల్పించడం మా బాధ్యత అన్నా రు. టెక్నాలజీ స్థానిక వ్యాపారాలను బలపరచాలి గానీ భర్తీ చేయకూడదని, పారదర్శక విధానాలు, న్యాయమైన ధరలు ద్వారా వారి కి స్థిరమైన భవిష్యత్తు అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.

డైరెక్టర్ పీ.చందు మా ట్లాడుతూ... మెట్రో నగరాల తరహాలోనే టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు సమాన డిజిటల్ అవకాశాలు అందించాలనే మా సంకల్పమన్నారు. విక్రేతలకు మెరుగైన లాభా లు, వినియోగదారులకు వేగం, విశ్వాసం కల్పించేలా జస్ట్‌బాట్ రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్ర మ నిపుణులు, వ్యాపారులు, స్థానిక రిటైలర్లు పాల్గొన్నారు.