17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నేడు రాష్ట్రానికి రాహుల్‌గాంధీ రాక

02-03-2026 12:58 AM
  1. వికారాబాద్‌లో జరిగే డీసీసీ అధ్యక్షుల ముగింపు సమావేశానికి హాజరు 
  2. మావోయిస్టు మాజీ అగ్రనేతలతో భేటీ? 

హైదరాబాద్, మార్చి1(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరిగే ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి  ఆయన హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు రాహుల్‌గాంధీ శంషాబాద్ విమానాశ్రాయానికి రానుండగా, సీఎం రేవంత్‌రెడ్డి ఏయి ర్‌పోర్టులో స్వాగతం పలకనున్నారు.

అక్కడి నుంచి రాహుల్‌గాంధీతో కలిసి నేరుగా వికారాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ, అంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం తర్వాత తిరిగి రాహుల్‌గాంధీ శంషాబాద్ ఏయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇటీవలనే జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు  రాహుల్‌గాంధీ భేటీ అ య్యే అవకాశం ఉందని సమాచారం.

ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీపై కేం ద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చిం చే అవకాశం ఉందని తెలిసింది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సచివాలయంలో మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాహుల్‌గాంధీతో భేటీ అవుతారనే ప్రచారంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.