calender_icon.png 9 January, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగ్న సత్యాన్ని చెప్పే దిల్ దియా

04-01-2026 12:00:00 AM

వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న చైతన్యరావు మాదాడి కథానాయకుడిగా రూపొందుతున్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్‌లైన్. కే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో శ్రియాస్ చిత్రాస్, ఏ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్లపై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్యరావుతోపాటు ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మణి చందన, ప్రమోదిని, వీరశంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోన్న.

ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా శనివారం విడుదల చేశారు. ఫస్ట్‌లుక్, టైటిల్ పోస్టర్‌నున గమనిస్తే.. బట్టలు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్యరావు కనిపిస్తారు. భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే సంఘర్షణలను చూపించే ట్రెండింగ్ డ్రామాగా ఉండబోతుందీ సినిమా. 2026 వేవిలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: ఫణి కళ్యాణ్; డీవోపీ: పీజీ విందా; ఎడిటర్: రవి-శశాంక్; ప్రొడక్షన్ డిజైన్: చిన్నా.