calender_icon.png 8 January, 2026 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్నింగ్ షోతోనే ఫుల్ మీల్స్ పెట్టే జెట్లీ

04-01-2026 12:00:00 AM

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేశ్ రానా ’జెట్లీ’తో అలరించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి చెర్రీ, హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్స్ పోస్టర్లకు మంచి స్పందన దక్కించుకున్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ శనివారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో సత్య మాట్లాడుతూ.. “ఇందులో స్పెషల్ హీరోలా అంటూ ఏమీ ఉండదు.

యాక్షన్‌లో కూడా కామెడీని ఫీల్ అవుతారు. ఈ సినిమా కోసం యాక్షన్ చేశా. నాన్‌చాక్ నేర్చుకున్నా” అని తెలిపారు. డైరెక్టర్ రితేశ్ రానా మాట్లాడుతూ.. “డైరెక్టర్‌గా నాకు జన్మనిచ్చింది సత్య. నా గాడ్‌ఫాదర్ ఆయనే. సత్య అభిమానులందరికీ ఒక మాట చెప్తున్నా. మీకు మార్నింగ్ హెవీ బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే మార్నింగ్ సోకి రాకండి. ఎందుకంటే మేము మార్నింగ్ షోనే ఫుల్ మీల్స్ పెడతాం” అన్నారు.

నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. “ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరి నాటికి పూర్తయిపోతుంది. ఇది అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ. యూనిక్ కాన్సెప్ట్. సినిమా అంతా ఫ్లైయిట్‌లో షూట్ చేశాం. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు. ‘ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాతో తెలుగులోకి రావడం హ్యాపీగా ఉంద’ని రియా సింఘా తెలిపింది.