13-05-2025 08:02:57 PM
మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలలో మే 15 నుండి 26 వరకు వైద్య ఆరోగ్య శాఖ తరపున నిర్వహించే వైద్య ఆరోగ్య క్యాంపులను రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్(State Health Director Dr Ravindra Naik) మంగళవారం సందర్శించారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో కలిసి హెల్త్ క్యాంపుల ఏర్పాట్లు, సిబ్బంది వివరాలు, ఔషదాలు, సిబ్బంది వసతి గురించి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో క్యాంప్స్ జరిగే ప్రదేశాలను పరిశీలించారు.
సరస్వతి పుష్కరాలలో 10 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, క్యాంపులలో ఇరవై బెడ్స్ అందుబాటులో ఉంచినట్లు ఈ క్యాంపులో ఇరవై మంది సిబ్బంది ఉంటారని, 9 పేరెపరల్ క్యాంప్స్ లో ప్రతి షిప్ట్ లో ఆరుగురు సిబ్బంది వుండే విధంగా ఏర్పాటు చేసినట్లు, ఈ మెడికల్ క్యాంప్స్ కు సరిపడ డాక్టర్స్ పారామెడికల్ సిబ్బందిని నియమించినట్లు పుష్కర భక్తులకు అనారోగ్యానికి గురైన వారికి అన్ని రకాల వసతులు కలిపించే విధంగా ఏర్పాట్లు చేసున్నాట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, భూపాల్ పల్లి జిల్లా వైద్య అధికారి మధుసూదన్ ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్ రావు, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ సందీప్, డిపిఓ చిరంజీవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని డాక్టర్ సుస్మిత, హెల్త్ అసిస్టెంట్ రాజా రమణయ్య, సత్యనారాయణ, వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.