calender_icon.png 17 May, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేకల దొంగలు అరెస్ట్

13-05-2025 07:55:34 PM

నాలుగు నెలల క్రితం అబ్దుల్ నాగారంలో చోరీ..

ముగ్గురుని మరియాపురం వద్ద అరెస్టు చేసిన పోలీసులు..

తరిగొప్పుల: నాలుగు నెలల క్రితం తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారంలో మేకలను దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 29న అబ్దుల్ నాగారంలో నీల కనకయ్యకు చెందిన 9 మేకలు, ఒక గొర్రెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. మంగళవారం తరిగొప్పుల ఎస్సై శ్రీదేవి ఆధ్వర్యంలో మరియాపురం బస్టాప్ వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అబ్దుల్ నగరంలో చోరీకి పాల్పడింది వాళ్లేనని ఒప్పుకున్నారు. పట్టుబడిన వారిలో జనగామ జిల్లా చిల్పూర్ కు చెందిన గండికోట సతీష్, మల్కాపూర్ గ్రామానికి చెందిన కొమ్మరాజుల రాకేష్, నల్గొండ జిల్లా గుండాల మండలం మోతుకూరు గ్రామానికి చెందిన రాపోలు వంశీ ఉన్నారు. వీరు అబ్దుల్ నగరంలో చోటు చేసిన జీవాలను హైదరాబాద్లోని చెంగిచెర్ల సంతలో అమ్మేసినట్టు ఒప్పుకున్నారు. వీరి వద్ద రూ.60,000 స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు ఎస్సై గుగులోత్ శ్రీదేవి తెలిపారు.