22-12-2025 12:00:00 AM
సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
ఆదిలాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులను డీసీసీ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ కలిసారు. హైదరాబాదులో ఆదివారం ఉట్నూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ లతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి సీతక్క ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అంశాలు, అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు సాధించిన విజయం గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై వినతులు సమర్పించారు. పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని డీసీసీ అధ్యక్షుడు తెలిపారు.