23-12-2025 01:34:24 AM
తెలంగాణను తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయింది
హరీశ్‌రావు పేరు గోబెల్స్ పెట్టుకోవాలి
మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఆంధ్రావాళ్లకు అమ్ముడుపో యిందే బీఆర్‌ఎస్ పార్టీ అని, అయినా కేసీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్యలు సిగ్గులేకుండా ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. కేసీఆర్ డిజైన్ చేసి, నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డ గురిం చి మాట్లాడటం ఆపి, సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
తెలంగాణ ప్రజల తలల ను తాకట్టు పెట్టి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని, రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని అన్నారు. కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 70 టీఎంసీలు మాత్రమే నీళ్లను ఉపయోగించా రని చెప్పారు. 45 టీఎంసీల లేఖ కొత్తది కాదని, కేసీఆర్, హరీశ్‌రావు బరితెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. హరీశ్‌రావు అతి తెలివి తేటలు వాడటం ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.
హరీశ్‌రావు పేరు గోబెల్స్ అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కృష్ణా జల్లాల విషయంలో 2014 నుంచి 2020 వరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ సంతకా లు పెట్టారని, కాంట్రాక్టర్ల కోసం కమీషన్లకు కక్కుర్తి పడి ఆపెక్స్‌లో తక్కువ వాటాకు ఒప్పుకున్నారని ఆరోపించారు. పాలమూరు, డిండి, ఎస్‌ఎల్బీసీలను కేసీఆర్ ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి రూ. 20 వేల కోట్లు కడుతున్నామని, కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఒప్పందాన్నే మేము లేఖను రాశామన్నారు. 90 టీఎంసీలను గతంలో కేసీఆరే డివైడ్ చేసి 45 టీఎంసీలుగా చేశారని వివరించా రు. పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదని, పదేళ్ల పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్క డి ప్రజలను మోసం చేసింది కేసీఆరే అని ధ్వజమెత్తారు. 90 శాతం పనులు పూర్తి అయితే.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఎందు కు ఇయ్యలేదని ప్రశ్నించారు. పాలమూరు మాత్రమే కాదు, అన్ని ప్రాజెక్టులు తిరిగేందుకు మేము సిద్ధమేనన్నారు.
2020 కేఆర్‌ఎంబీ మీటింగ్‌లో 45 టీఎంసీ తెలంగాణకు సరిపోతాయని కేసీఆర్ ఒప్పుకున్నందుకు ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట్లాడితే కాంట్రాక్టర్లు అంటున్నారని, మొత్తం లెక్కలు తీస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. కేసీఆర్ 34 శాతం కావాలని అంటే మేము వచ్చాక 70 శాతం వాటా కావాలని లేఖ రాశామని గుర్తు చేశారు. కేసీఆర్, హరీశ్‌రావు ద్రోహం, కుట్రతో ఏపీకి నీళ్లు అప్పగించారని ఆరోపించారు.
కేసీఆర్, హరీశ్‌రావు తీస్మార్‌ఖాన్లు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఏపీతో కుమ్మకై రోజుకు 3 టీఎంసీలు అప్పగించారని, అబద్ధాలు మాట్లాడ టానికి హరీశ్‌రావుకు నోరు ఎలా వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించామన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాకు అన్యాయం చేసేందుకే కేసీఆర్ డిండికి అనుమతి ఇవ్వలేదన్నారు. బ్రహ్మణవెల్లి ప్రాజెక్టు పై కుట్రచేశారన్నారు.
కఠినంగా వ్యవహరిస్తాం..
పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో ఇటీవల కూలిన చెక్‌డ్యాంల ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనను ప్రభు త్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. కూలిపో యిన చెక్‌డ్యాములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీచేశారు. చెక్‌డ్యాములను నాసిరకంగా, నాణ్యతలేమితో నిర్మించారా? లేక ఎవరైనా కావాలనే ధ్వంసం చేశారా? అనే అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని విజిలెన్స్ విభాగాన్ని మంత్రి ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు మేలు చేసే చెక్‌డ్యామ్‌ల ధ్వంసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఊపేక్షించబోదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.