23-12-2025 01:32:50 AM
కొడిమ్యాల, డిసెంబరు 22 (విజయ క్రాంతి): కొడిమ్యాల మండల కేంద్రం లో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖ ను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల్లో ఆధునిక బ్యాంకు సేవలందిస్తున్న గా యత్రి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందు తూ, ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సి హెచ్. మనోజ్ కుమార్, జగిత్యాల ఆర్డీవో పి. మధుసూదన్, తహసీల్దార్ కిరణ్ కుమా ర్, ఏం పి డి వో స్వరూప, గాయత్రి అర్బన్ బ్యాంకు సి ఈ వో వనమాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.