calender_icon.png 23 December, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్నాడే మహారాజ్‌కు నివాళి

22-12-2025 12:00:00 AM

వాంకిడి, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): సంత్ శ్రీ సంతాజీ జగన్నాడే మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శివకేశవ నగర్లో గాండ్ల తేలి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతాజీ జగన్నాడే మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రంధాజలి ఘటించారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలను కుల సంఘం నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక సేవకుడు దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ  జగన్నాడే మహారాజ్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తేలి గాండ్ల సంఘం నాయకులు ఇటంకర్ సాధశివ్, బుట్లే ఉద్దావ్, హివేరే రాజు, దుర్గం ప్రశాంత్, చవాన్ వికాస్, నాందేవ్, తిరుపతి, నిఖిల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.