23-12-2025 01:34:27 AM
అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, డిసెంబర్22(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా, అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శాలువతో సన్మానించి రివార్డును అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల కొ త్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ఆటో వద్ద నిలబడి ఉన్న రఫీ వయస్సు 60 సంవత్సరాలు గల వృద్ధుడిని ఒక ద్విచక్రవాహ నం వచ్చి ఢీకొట్టడం జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే రఫీ స్పృహ కోల్పోయాడు. కాగా, అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హో మ్ గార్డ్ చంద్రశేఖర్ గమనించి రఫీకి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. అనంతరం రఫీ యొక్క కుటుంబ సభ్యులకు సమాచా రం అందించి అతడిని అంబులెన్స్ లో ప్ర భుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్ , ప్ర ధమ చికిత్సలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం ద్వారా నేర్చుకున్న విషయాలు పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం ద్వారా ఇలాం టి కార్యక్రమాలు ఆవశ్యకతను మరింత తెలియజేస్తున్నాయని ఎస్పి అన్నారు.