calender_icon.png 17 February, 2026 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు

17-02-2026 05:40:32 PM

అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం ఎదురుగా శ్రీ అన్నపూర్ణ సేవా సమితి కరీంనగర్, చొప్పదండి, సుల్తానాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.

ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సుల్తానాబాద్ కు చెందిన శ్రీ అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకులు బొడ్ల శ్రీనివాస్, నాగమల్ల ప్రశాంత్, పల్లా శరత్, పల్లా అనిల్, అల్లంకి అరుణ్, చకిలం  వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్, శ్రీ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, సామాజిక సేవకులు పల్లకిషన్, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పల్లా శ్రీనివాస్ (వాసు), కొమురవెల్లి శ్రీకాంత్ తో పాటు కరీంనగర్, చొప్పదండి ఆర్యవైశ్య సంఘం నాయకులు, స్థానిక  ప్రముఖులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.