17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దొడ్డి కొమురయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

17-02-2026 05:43 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం భీల్యా నాయక్ తండాలో దొడ్డి కొమరయ్య సినిమా దర్శకులు ఎం.సేనాపతి, కోదాడ నియోజకవర్గం దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్, సహనిర్మాత అంకతి అనసూర్య, బానోతు రంగా నాయక్ టీం సభ్యులు దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తెలంగాణ ప్రజలకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేవని అవకాశం కోసం మనం ఆంధ్ర  సినిమా పెట్టుబడుల దారులు దగ్గర బిచ్చగాల అడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మన తెలంగాణ చరిత్రను,మన తెలంగాణ వీరుల పోరాటం గురించి భావ్య ప్రపంచానికి తెలియనీయకుండా ఈ ఆంధ్ర పెట్టుబడుల దారులు ప్రయత్నం చేస్తున్నారని మడ్డిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బానోతు జగన్ నాయక్, కోట నాయక్,గోవిందు,వార్డు సభ్యులు బాలకృష్ణ నాయక్,బాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.