27-12-2025 07:08:51 PM
సామాజిక కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్
కోదాడ: కోదాడ శివారు లక్ష్మీపురంలో నిర్మించిన గిరిజన బాలుర హాస్టల్ భవనం నిరూపయోగంగా ఉందని సామాజిక కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ... భవన నిర్మాణం పూర్తైనా నేటి వరకు ఉపయోగంలోకి తీసుకరాలేదన్నారు. గిరిజన హాస్టల్ కు ఉపయోగపడకపోతే ఈ భవనాన్ని అంగన్వాడీ భవనం ప్రైమరీ హెల్త్ సెంటర్, లైబ్రరీల కోసం కేటాయించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.