27-12-2025 07:26:13 PM
బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి అనుబంధ గ్రామమైన ఎల్లంపల్లి లో ఇటీవల కాల్వ శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించినందున శనివారం శివసేన యూత్ సభ్యులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు, మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు 9 నెలల చిన్న పాప ఉంది. అనంతరం వారి కుటుంబానికి యాభై కిలో ల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు దొంతరవేణి మహేష్, గుబిరె హరి, ప్రకాష్, అంతటి రాకేష్, బోనగిరి బాబు ,ఎలిగే సతీష్, మహేందర్, కమలాకర్, బోనగిరి రఘువర్ధన్, తదితరులు పాల్గొన్నారు.