27-12-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 26: సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా లో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర మోడీ గవర్నమెంట్ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో అ ప్రజాస్వామికమైన ఐదు చట్టాలను చేసి దేశంలో రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు ప్రజలకు నష్టం కలిగించే విధానాలు తెచ్చారని,
ప్రధానంగా లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను సమ్మెను ఉద్యోగ భద్రతను పోరాడే హక్కును నిర్వీర్యం చేసిందని, తక్షణమే ఈ చట్టన్నీ, విద్యుత్ సవరణ చట్టాన్ని శాంతి బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారులేనిచో ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతుందని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడియాల మోహన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య,సిఐటియు సీనియర్ నాయకులు కిల్లే గోపాల్, రైతు సంఘం సీనియర్ నాయకులు ఏ. రాములు తదితరులు ఉన్నారు.