calender_icon.png 27 December, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

27-12-2025 07:11:21 PM

కోదాడ: సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని కార్యాలయంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఇటీవల సూర్యాపేట జిల్లా కార్యవర్గంలో కోదాడ నుంచి  అధ్యక్షులుగా ఎన్నికైన బొల్లు రాంబాబు, విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్, శోభారాణి,పొట్ట జగన్మోహన్ తో పాటు ఇతర సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, హమీద్ ఖాన్, జానయ్య, వీరబాబు, భ్రమరాంబ, ఎస్ దాని, బాలే మియా, హాజీ నాయక్ గురవయ్య పందిరి రఘువరన్, ప్రసాద్, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.