calender_icon.png 25 November, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు చెక్కుల పంపిణీ

25-11-2025 12:51:16 AM

ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, నవంబర్ 24 (విజయ క్రాంతి): విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన కానిస్టేబుల్ వడ్ల రవి విధి నిర్వహణలో భాగంగా గతేడాది కారు ఢీకొనడంతో మృతి చెందాడు. రవి మరణానంతరం ఆయన సతీమణికి కారుణ్య నియామకం కింద ఎస్పీ రాజేష్ చంద్ర  ఉద్యోగం కల్పించారు. అయితే కానిస్టేబుల్ రవికి ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉండడంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అతనికి మంజూరైన రూ.కోటి రూపాయల బీమా చెక్కును మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్‌చంద్ర చేతుల మీదుగా రవి భార్యకు చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఉద్యోగి ఎస్‌బీఐలో శాలరీ ఖాతా తీసుకోవాలని సూచించారు. తద్వారా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు బీమా అందుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి  ఎస్‌బీఐ నిజామాబాద్ డీజీఎం బిజయ్ కుమార్ సాహూ, కామారెడ్డి ఆర్‌ఎం వెంకటేశ్వర్లు, చీఫ్ మేనేజర్ సోమేశ్వర్ రావు, చీఫ్ మేనేజర్ వరప్రసాద్, హెచ్‌ఆర్ మేనేజర్ రమణ, బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు.