calender_icon.png 25 November, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్తను సజీవ దహనం చేసిన భార్యలు

25-11-2025 12:50:43 AM

  1. కుటుంబ కలహాలతో డీజిల్ పోసి నిప్పంటించిన సతులు

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

అనాథలైన ఐదుగురు బిడ్డలు

భీమగల్ మండలం దేవక్కపేటలో దారుణం

నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ఘటన

మోర్తాడ్, నవంబర్ 24 (విజయ క్రాంతి ): నిజామాబాద్ జిల్లా భీమగల్ మం డలం దేవక్కపేట గ్రామంలో సోమవారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఇద్దరు భార్యలు డీజిల్ పోసి నిప్పటించిన ఘటనలో అతను అక్కడికక్కడే ప్రా ణాలు వదిలాడు. ఎస్‌ఐ కే.సందీప్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమ్ నగర్ (దేవక్కపేట్)లో సోమవారం ఈ దారుణం చో టుచేసుకుంది.

దేవక్కపేట్ గ్రామానికి చెం దిన మాలవత్ మోహన్ (39)కు కవిత, సం గీత అనే ఇద్దరు భార్యలు. ఐదుగురు కుమార్తెలు. మొదటి భార్య సంగీతది మానాల, రెండో భార్య కవితది తాళ్లపల్లి గ్రామం. మొదటి భార్యకు ముగ్గురు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోహన్ ఇంటి వద్ద వ్యవసాయం పనులు చేసుకుంటూనే, వివాహల కు, శుభకార్యాలకు బ్యాండ్ కొట్టేందు కు వెళ్తూ ఉంటా డు.

భర్తకు, ఇద్దరు భార్యలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం సైతం మోహన్ ఇద్దరు భార్యలతో గొడవ జరిగినట్టు సమాచారం. దీంతో ఆవేశానికి గురైన సంగీత, కవితలు కుర్చీలో కూర్చుని ఉన్న భర్త మోహన్‌పై డీజిల్ చల్లి నిప్పంటించా రు. మంటలు ఒక్కసారి వ్యాపించి మోహన్ అక్కడికక్కడే మృ తిచెందాడు. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర కలవరనికి లోనయ్యారు.

సమాచారం అందుకున్న సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్‌ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. భర్తను దారుణంగా హత్య చేసిన మోహన్ భార్యలు ఇద్దరిని పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లులు ఇద్దరు జైలు కు వెళ్లడంతో ఐదుగురు ఆడపిల్లలు అనాధలుగా మారారు. ఈ సంఘటన భీమ్గల్ మం డలంలో తీవ్ర కలకలం రేపింది.