25-11-2025 12:48:57 AM
- అధికారులను ప్రజాప్రతినిధులను నిలదీసిన గ్రామస్తులు
- 75 గజాల భూమి, ఇల్లు కట్టిస్తానని మాటిచ్చిన రూరల్ ఎమ్మెల్యే
ధర్పల్లి, నవంబర్ 24 (విజయ క్రాంతి): ధర్పల్లి మండలంలో గత ప్రభుత్వం నిరు పేదల కోసం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ డబల్ బెడ్ రూమ్ ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అర్హులైన లబ్ధిదారులు ఆరోపించారు. పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే దాదాపు 200 పైచీలుకు లబ్ధిదారులు ఉన్నట్లు ఆయన చెప్తూనే 48 ఇండ్లు పంపిణీ చేయడంతో ధర్పల్లి లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదలకు ఇస్తామని చెప్పి మోచేతికి బెల్లం పెట్టిందని ఎద్దేవ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలకు ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు కల్పిస్తామని చెప్పిన ఆశలు నిరాశలయ్యాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రములోని నాటి డబల్ బెడ్రూం మరమ్మత్తులు చేపట్టకుండా హడావిడిగా పంపిణీ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు పలు విమర్శలు చేస్తూనే ఇదంతా స్థానిక ఎలక్షన్ల కోసమేనా అంటూ గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కొత్త మొఖం,కొత్త పేర్లతో చిట్టా పద్దు దర్శనమివ్వడంతో అసలు నిరుపేదలు ఆందోళణలు చేపట్టారు. గత 30 నుండి 40 సంవత్సరాల నిరుపేదలు ధర్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయుకులకు కనిపించలేదా పంపిణీ కార్యక్రమంలో ప్రశ్నలు వెలువెత్తాయి. ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు సర్వత్ర ఉత్కంఠ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా నిరుపేదలకు ఇవ్వనిది ఎవ్వరికి దక్కనియ్యమన్నా నిర పేదలు ! రెండు పడక గదుల 48 ఇండ్లు కేటాయింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిజామాబార్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ! ధర్పల్లి మండల కేంద్రములోని డబుల్ బెడ్రూం ఇండ్లనూ ప్రారంభోత్సవం చేసి ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం 48 కుటుంబాల లబ్దీ దారులకు అందజేసి మళ్ళి ఇంకా 200 వరకు నిరుపేద కుటుంబాలు ఉన్నాయని అంటున్నారు కదా మళ్ళి రెండవ విడుతలో అందరికి అమలు చేస్తామని లక్కీ డ్రా నిర్వహించారు.
అనంతరం అసలైనా నిరు పేదలు వారు చెప్పింది వినకుండా లబ్దిదారుల బాధలు వినకుండా మొహం చాటేసి కార్ లో ప్రయాణమయ్యారు. తదంతరం నిరాశయులు ఆందోళణ చేపట్టారు. చివరకు ఏమి చేయలేక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేయగా.. కొందరు నిరుపేద మహిళలు కాన్వాయికి అడ్డుగా నిలబడడంతో పోలీసులు సద్దుబాటు చేసి అక్కడి నుండి నిష్క్రమించారు.