calender_icon.png 23 January, 2026 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

23-01-2026 12:56:25 PM

బెజ్జూర్ జనవరి 23 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన  9 మంది లబ్దారులకు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు సీ.ఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసినట్లు బిజెపి నాయకులు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నీది కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల కు మంజూరైన చెక్కులు ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే సూచనల మేరకు ఇంటి వద్దకే వెల్లి చెక్కులను అందించినట్లు బిజెపి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జాడి దిగంబర్, వాసి ఉల్లా ఖాన్, మెస్రం  రాజారాం ,కోరెత తిరుపతి, ఆదే అశోక్ ,బెనికి శ్యాంసుందర్, వార్డు సభ్యులు సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.