12-04-2025 12:30:48 AM
రాజాపూర్ ఏప్రిల్ 11: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
మండ ల పరిధిలోని తీర్మాలపూర్ గ్రామానికి చెందిన మలగల నర్సింహా కు రూ 23 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రె స్ పార్టీ అధ్యక్షులు కత్తెర కృష్ణయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.