24-09-2025 12:00:00 AM
-సెలవుల్లోనూ.. చదువుల బాధలు..!
- ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాకం
- దసరా సెలవుల్లోనూ టీచర్లు రావాల్సిందేనని హుకుం
- అడ్మిషన్ల పేరిట వేధింపులు
- అడ్మిషన్లు చేస్తేనే జీతం.. ప్రైవేటు యజమాన్యాల వైఖరి
- మామూళ్ల మత్తులో విద్యాధికారులు
- విద్యా శాఖ తీరుపై మండి పడు తున్న విద్యార్థి సంఘాలు
మణుగూరు, సెప్టెంబర్ 23 (విజ యక్రాంతి) :ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పనితీరు విద్యాశాఖ మంత్రి పదవికే కలంకంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాల ను బేఖాతరు చేస్తూ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మండల విద్యా ధికారులు మామూళ్ల మత్తులో కళ్ళు మూ సు కుంటున్నరనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
దసరా సెలవుల్లో తరగ తులు నిర్వ హించరాదనే ప్రభుత్వ నిబంధనలను జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలు తుం గలో తొక్కుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలకు ప్రభు త్వం సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించినా, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ తరగతుల నిర్వహణ, టీచర్లతో అడ్మిషన్లు చేయిస్తున్నారు. సెలవుల్లో అనధికారికంగా తరగతులు నిర్వహిస్తే ఆవిద్యా సంస్థల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన. బేసరత్తుగా తరగతుల నిర్వహణ సాగిస్తున్నారు. బహిరంగంగానే తరగతులు నిర్వహిస్తున్న మండల విద్యాకారులకు చూసి చూడనట్లు వ్యవహరించటం ఆరోపణలుదృవపరుస్తున్నాయి.దీనిపై విజయక్రాంతి కథనం..
ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాకం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు అన ధికారికంగా తరగతులు నిర్వహి స్తున్నట్లు తెలిసింది. విద్యార్థులకు ప్ర త్యేక తరగతులు పేరుతో అన ధికారికంగా పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. అంతే కాకుండా హోం వర్క్ పేరుతో విద్యార్థులకు రెస్ట్ లేకుండా చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నారు. టీచర్ల పై ఒత్తిడి పెంచుతూ తరగ తులు నిర్వహిస్తున్నారనే టాక్ వినబడుతోంది. ఉపాధ్యాయులను,యాజమాన్యలు విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నా రు.ప్రైవేట్ పాఠశాలల నిర్వాకంతో దసరా సెలవుల్లోనూ విద్యార్థులకు చదువుల బాధలు తప్పడం లేదు. ర్యాంకుల పేరుతో సంవత్సరం పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టి స్తు, ప్రత్యేక వసతుల పేరిట తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్నారు. ఎవరై నా పండగ సెలవులు కదా అంటే మీ పిల్లలకుర్యాంకులు రావాలా.. వద్దా అంటూ కరకు గా సమాధానం చెబుతున్నారు. పైగా సెలవులే కదా బస్సులు నడపం.. మీరే ఎక్కిం చుకురావాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీని పై సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
టీచర్లు రావాల్సిందేనని హుకుం..
మనకు సెలవులు లేవు, పాఠశాలకు రావాల్సిందేనని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు టీచర్లకు షెడ్యూల్ పంపిస్తున్నట్లు తెలుస్తుంది. కొందరిని తరగతుల కుపంపించి మరి కొందరికి అడ్మిషన్ల టార్గెట్ విధించి వారిని క్యాంపెనింగ్ పంపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడ్మిషన్లు చేస్తే నే వచ్చే విద్యా సంవత్సరం కోలువు ఉంటుందని లేదంటే వేరే పని చూసుకోవచ్చని స్పష్టం చేయడంతో ఏం చేయాలో టీచర్లు ఆయా పాఠశాలల రంగురంగుల బ్రోచర్లతో అడ్మిషన్ల కోసం రోడ్ ఎక్కుతున్నారు.
మండి పడుతున్న విద్యార్థి సంఘాలు...
జిల్లాలో డీఈఓ, మండల విద్యాశాఖ అధికారులు కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంకి లోబడి పనిచేస్తున్నారని, నిబంధ నలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎబివిపి, బీఆర్‌ఎస్వీ,ఎస్ ఎఫ్ ఐ అలాగే బీసీ, ఎ స్సీ, ఎస్టీ,గిరిజన విద్యార్థి సంఘాల విద్యా ర్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.సంవత్సర మంతా విరామం లేకుండా చదివే పిల్ల లకు పండగ పూట సెలవులలో కొంత మానసిక విశ్రాంతి లభిస్తుందని, దానికి కూడా వారినీ దూరం చేస్తూ క్లాసులు నిర్వహించట మేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎన్ని సార్లు సమాచార హక్కు చట్టం క్రింద ప్రయివేటు పాఠశాల వివరాలు అడిగిన వాటికి సంబంధించిన అనుమతుల వివరాలు అడిగిన, ఇ వ్వక పొగ వారికి ఫిర్యాదు దారుల వివరాలు వారికి అంది స్తున్నారని, ప్రైవేటు పాఠశాలలు ఈ స్థితోలో వ్యవహరించడానికి విద్యా శాఖ అధికారుల పని తనేమే నిదర్శనం అని ఆయా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వ కుండా తరగతులు నిర్వహిస్తున్న చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పాఠశాలలో నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం డిఇఓ నాగలక్ష్మి
జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా దసరా సెలవులను పా టించాలనీ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల నిర్వహిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. మణుగూరు మండలంలో పాఠశాలల నిర్వహణ అంశం తన దృష్టికి రాలేదని మండల విద్యాధికారిని పంపి పర్యవేక్షిస్తామని. ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.