24-09-2025 12:01:46 AM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయ విద్యార్థులు, నిరుద్యోగుల జేఏసీ చేస్తున్న దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ని తక్షణమే విడుదల చేయాలని నిరసనలు తెలిపారు. లేకపోతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు.