23-09-2025 11:58:05 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): గల్ఫ్ లో గుండెపోటుతో కామారెడ్డి జిల్లా వాసి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా చుక్కాపూర్ గ్రామానికి చెందిన కాబట్టి చిన్న ఎల్లయ్య (46) గత ఏడాది క్రితం బైరన్ దేశానికి గల్ఫ్ కు వెళ్ళాడు. ఎస్ టి ఎస్ కంపెనీలో కూలీ పనిలో చేరాడు. ఎల్లయ్య తాను చేస్తున్న కూలి సంపాదనతో చేసిన అప్పులు తీర్చ లేనని అనునిత్యం సాచార కూలీలతో ఆవేదన చెందేవాడని ఎన్నారై వెంకటస్వామి తెలిపారు. అక్కడ కూలి పనులు సైతం లభించక కొలత చెందిన ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడు.
స్వదేశానికి మృతుని మృతదేహాన్ని పంపడానికి ఎన్ నారాయణ సంఘం సహకరిస్తుందని తెలిపారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని వెంకటస్వామి కోరారు. గతంలో ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం ఐదు లక్షల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందేనని వెంకటస్వామి తెలిపారు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. గల్ఫ్ కు వెళ్లి కుటుంబానికి ఆర్థిక అవసరాలు తీరుస్తారని భావించిన కుటుంబ సభ్యులకు ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందడం తీవ్రంగా విషాదాన్ని నింపింది.