calender_icon.png 24 September, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025’కు కేటీఆర్‌కు ఆహ్వానం

24-09-2025 12:05:14 AM

కేటీఆర్‌ను స్వయంగా ఆహ్వానించిన తాల్ హాస్పిటల్స్ సీఈఓ సాయి గుండవెల్లి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్‌ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్ హాస్పిటల్స్ సీఈఓ సాయి గుండవెల్లి మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌కు  అందజేశారు. 

అక్టోబర్ 24, 2025న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోలో ఈ ‘హెల్త్‌ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, మార్పు తీసుకొచ్చేవారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై చర్చించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ  కార్యక్రమంలో కేటీఆర్ కీలకోపన్యాసం ఇవ్వనున్నారు.  ఆహ్వానాన్ని కేటీఆర్ అంగీకరి ంచినందుకు ట-చ్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది.