24-09-2025 12:04:40 AM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో మంగళవారం పందిళ్ళ శేఖర్ బాబు స్మారక నాటకోత్సవాలు- 2025 ను అధ్యక్షుడు వనం లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ, చలన చిత్ర అభివృద్ధి సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు రంగస్థల కళాకారుడు, మిర్యాలగూడ వాసి పులి కృష్ణమూర్తి గారిని శాలువా, జ్ఞాపకతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పులి కృష్ణమూర్తి కళారంగానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం చైతన్య కళాభారతి కరీంనగర్ వారి చేత ఖరీదైన జైలు అనే నాటిక, నవజ్యోతి కళామండలి జడ్చర్ల వారిచేత మైరావణ పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించడం జరిగింది.