24-09-2025 12:00:00 AM
ఎస్పీ శరత్ చంద్రపవార్
నల్గగొండ క్రైమ్, సెప్టెంబర్ 23 : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోమ్ గార్డ్ లకు, స్పెషల్ పార్టీ సిబ్బందికి ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్, జంగిల్ ప్యాచ్,కిట్ బ్యాగ్స్ అందజేశారు. వాటిని సద్విని యో గం చేసుకో వాలని కోరారు. విధినిర్వహణలో క్రమశిక్షణగా విధులు నిర్వహిస్తున్న హోమ్ గారడ్స్ సిబ్బందికి ఎల్లప్పుడు అం డగా ఉంటామన్నారు.
ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోమ్ గార్డ్ ఆర్.ఐ శ్రీను,అడ్మిన్ ఆర్.ఐ సంతోష, ఆర్.ఎస్.ఐలు కళ్యాణ్ రాజ్, రాజీవ్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్‌గార్డులు పాల్గొన్నారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎస్పీ
సూర్యాపేట, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రభుత్వ కార్యాలయాల భద్రత తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ కె.నర్సింహా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి ఆవరణను పరిశీలించి పలు విషయాలపై వైద్యాధికారులను ఆరాతీశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యా ధికారులు పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని ఎలాంటి మెడికో లీగల్ కేసులు నమోదు అయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు ఉచితమైన మెరుగైన వైద్య సేవలు అందిస్తు న్నారని ఇలాంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ వైద్యాధికారులపై ఆసుపత్రి నిర్మాణాలపై, వైద్య పరికరాలపై ఎలాంటి దాడులకు పాల్పడవద్దన్నారు. డిఎస్పి ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, వైద్యాధికారులు డాక్టర్ విజయ్ కుమార్, డా.వినయానంద్ డా.లక్ష్మణ్, డా.మనీష, సిబ్బంది ఉన్నారు.
మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్
కార్యాలయం తనిఖీ చేసిన ఎస్‌పీ
కోదాడ (మునగాల), సెప్టెంబర్ 23 : పోలీస్ కార్యాలయాల తనిఖీలలో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ నరసింహ మునగాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాల యాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికారడ్స్ ను, కోర్టు విధులను, ఎన్ఫోర్స్మెంట్ రికారడ్స్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, కార్యాలయ రికార్డులను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు.
అధికారుల పర్యవేక్షణ పటిష్టంగా ఉన్నప్పుడే కింది స్థాయిలో ప్రజలకు విలువైన సేవలు అందుతాయని, సిబ్బంది పటిష్టంగా పనిచేస్తేనే కేసులు తగ్గుతాయన్నారు. జాతీయ రహదారి ఎక్కువగా ఉ న్నందున రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విజయవాడ, హైదరాబాద్ రహదారి అయినందున అక్ర మ రవాణాలకు అవకాశం ఎక్కువగా ఉంటుందని వాటిపై ప్రత్యేక అన్నిగా పెట్టాలని సిఐ, స్థానిక ఎస్త్స్రని ఆదేశించారు.
ఈయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు సర్కిల్ ఎస్త్స్రలు సూర్యాపేట నడిగూడెం ఎస్త్స్ర అజయ్ కుమార్, మోతే ఎస్‌ఐ అజయ్, డిసిఆర్బి ఎస్‌ఐ యాకూబ్, డిసిఆర్బి ఏఎస్‌ఐ అంజన్ రెడ్డి, హెడ్ కానిస్టే బుల్ శేఖర్ రెడ్డి, సీసీ సందీప్ ఉన్నారు.