24-09-2025 12:08:45 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ను ఆపకపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు ఆందోళనవ్యక్తం చేశారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెం చాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపా రు.
సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ల్యాండ్ అక్విడేషన్ చేపట్టడం, భవిష్యత్‌లో డ్యామ్ ఎత్తును పెంచే ప్ర యత్నాలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రా న్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జి ల్లాల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. జూరాల, నాగార్జున సాగర్, పాలమూరు--రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
హైడల్ పవ ర్, రైతుల సాగు నీటికి కృష్ణానదిపై ఆధారపడ్డారని, ఈ నదిపై ఆల్మట్టి డ్యా మ్ ఎత్తు పెంపుతో రైతులకు నష్టం జరుగుతుందనే కారణంతోనే గతంలో సు ప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చిందని వివరించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోనూ కర్ణాటకలో ఉన్న ప్రభు త్వం ఆల్మట్టి ఎత్తు 519 నుంచి 524 మీటర్లకు పెంచాలని ప్రయత్నించిందన్నారు.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన త ర్వాత, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తెలంగాణకు కృష్ణా జలాల వాటా కేవలం 299 టీఎంసీ మాత్రమే సరిపోతుందని కేసీఆర్ సంతకం చేశారని, దీని కారణంగా నదీజలాల వాటాలో తెలంగాణకు నష్టం ఏర్పడిందన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు, రైతులకు అన్యాయం జరగకుండా ఎందుకు చొర వ చూపడం లేదు? అని ప్రశ్నించారు.