13-10-2025 12:00:00 AM
పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య
బెల్లంపల్లి, అక్టోబర్ 12 : కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఆదివారం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్డులను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పంపిణీ చేసి వివరించారు. ముందుగా దేవాపూర్ లోని కొమరం భీమ్ విగ్రహానికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసే ప్రయత్నం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి గ్యారెంటీ కార్డు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెంట బి ఆర్ ఎస్ నాయకులు రమణారెడ్డి తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.