calender_icon.png 13 October, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఒరిగిందేమీ లేదు

13-10-2025 12:00:00 AM

  1. పీఎం ధనధాన్య కృషి యోజన పథకంలో జిల్లాను చేర్చకపోవడం శోచనీయం

మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం

ఆదిలాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : ఉమ్మడి జిల్లాలో బీజేపీ నుండి నలుగురు ఎమ్మెల్యే లు, ఒక ఎంపీ గెలిచిన పీఎం ధనధాన్య కృషి యోజన పథకంలో ఆదిలాబాద్ జిల్లాను చేర్చకపోవడం ఎంపీ, ఎమ్మెల్యేల అసమర్థతకు నిదర్శనం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఎద్దేవ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలతో  రైతుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదురుకొని నల్ల రైతు చట్టాలను ఉపసం హరిం చుకొవడం కాక,  వ్యవసాయ పథకాలను ప్రవేశపెట్టి రైతులను మోసగిస్తున్నారే తప్ప రైతులకు ఎలాంటి లబ్ధి చేకూ రడం లేదన్నారు. 

ఆదివారం స్థానిక పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో జోగు రామన్న మాట్లాడుతూ... గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో రైతుబంధు పథకంతో రైతు లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తే పీఎం కిసాన్ సమ్మన్ యోజన పథకం లో  రైతుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ రావడం పై తీవ్రంగా మండిపడ్డారు. 59 లక్షల రైతుల సంఖ్య ఉంటే కిసాన్ సమ్మన్ యోజన పథకం లో 33 లక్షల మందికి తగ్గింది అన్నారు.

అలాగే ప్రధానమంత్రి ధనధ్యాన కృషి యోజన పథకంలో ఆదిలాబాద్ జిల్లాను చేర్చకపోవడంతో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల అసమర్థత బయటపడుతుందన్నారు. జిల్లా రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పథకంలో ఆదిలాబాద్ జిల్లాను చేర్చకపోవడం సిగ్గుచేటు అన్నారు.   కేంద్ర పథకాలతో రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలపై సబ్సిడి ఎగగోడుతూ విత్తనాలు మందులపై ధరలను పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కుమ్రా రాజు, ధమ్మపాల్, కనక రమణ, శుక్లల్, అశోక్, భూమన్న పాల్గొన్నారు.