18-01-2026 12:00:00 AM
జుక్కల్, జనవరి 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం గృహ జ్యోతి పథకం కింద లబ్ధి పొందుతున్న వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ కో సిబ్బంది ద్వారా లబ్ధిదారు పత్రాలను పంపిణీ చేయిస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో సోమావార్ మహేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద అందిస్తున్న లబ్ధిని వివరిస్తూ రూపొందించిన పత్రాన్ని వినియోగదారులకు అందజేస్తున్నారు.
రాష్ట్రంలో 52 లక్షల 82 వేల 498 మంది వినియోగదారులు గృహ జ్యోతి పథకంలో లబ్ధి పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ. 3,593 కోట్లు ఖర్చు చేస్తుంది. గృహజ్యోతిలో మినహాయించిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. లబ్ధిదారుడి పేరు గృహ జ్యోతి సర్వీస్ నెంబరు ఉన్న ఈ పత్రాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంగ్రామ్ సీనియర్ నాయకులు హన్మంత్ రావ్ దేశాయ్ మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ వాలంకే ప్రహ్లాద్ మద్యప్ప స్వామి ముంగ్డే వార్ బస్వంత్‌రావ్ విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రోసిడింగ్ పత్రాలు అందజేత
నాగిరెడ్డిపేట్,జనవరి 16 (విజయ క్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా గృహ జ్యోతి పథకం నెలకు 200 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అందిస్తుందని,ప్రతి ఇంటికి వివరించి 2 యూనిట్స్ ఉచిత ప్రెసిడెంట్ పత్రాలను మండలంలోని మాసానిపల్లి, గోపాల్పేట్ తదితర గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోపాల్పేట గ్రామ సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్,ఉప సర్పంచ్ గులాము హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి రాజు, ఎస్‌ఎల్‌ఐ సత్యనారాయణ, లైన్ ఇన్స్పెక్టర్ సురేందర్, లైన్మెన్ విట్టల్, జేఎల్‌ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.