17-01-2026 04:20:49 AM
నజ్ముల్ ఇస్లాంపై బీసీబీ వేటు
ఢాకా, జనవరి 16: బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, చివరికి ఆ దేశ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసు కుంది. బీసీబీ డైరెక్టర్, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాంను పదవి నుంచి తొలగించింది. ఆటగాళ్ల సమ్మె హెచ్చరికలు, బీపీఎల్ మ్యాచ్ బహిష్కరణ నేపథ్యంలో ఈ నిర్ణ యం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఢాకాలోని షేర్ నేషనల్ స్టేడియంలో జరగాల్సిన బీపీఎల్ మ్యాచ్‌కు చిట్టగాంగ్ రాయ ల్స్, నోఖాలి ఎక్స్‌ప్రెస్ జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగేందుకు నిరాకరించారు. దీంతో టాస్ ఆలస్యమై, మ్యాచ్ అధికారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణ లీగ్ మ్యాచ్‌గా ప్రారంభమైన రోజు, క్షణాల్లోనే బీసీబీ ఆటగాళ్ల మధ్య ఘర్షణగా మా రింది. ఈ నిరసనకు క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ పూర్తి మద్దతు ప్రక టించింది. నజ్ముల్ ఇస్లాం తక్షణమే రాజీనా మా చేయకపోతే అన్ని క్రికెట్ కార్యకలాపాలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. భా రతదేశంలో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్‌లపై చర్చలు, తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ ఉద్రిక్తత మరింత పెరిగింది. నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. బోర్డు ఆటగాళ్లపై ఖర్చు చేస్తున్న కోట్ల టాకా తిరిగి ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించడం, వరల్డ్ కప్‌లో ఆడకపోతే ఆటగాళ్లకు పరిహారం ఎందుకు ఇవ్వా లంటూ ప్రశ్నించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.