calender_icon.png 17 January, 2026 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9౦% పూర్తయినవేగా?

17-01-2026 02:30:51 AM

  1. చనాకా కొరాట ప్రాజెక్ట్‌కు 2023లోనే ట్రయల్ రన్ 
  2. మా హయాంలోనే సదర్మట్ బరాజ్ 9౦% పనులు పూర్తి 
  3. వాటి ప్రారంభోత్సవం ఆనందాన్నిచ్చింది.. 
  4. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, 95 శాతం పైగా పనులు పూర్తి చేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు ప్రారంభం కావడం సం తోషదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పం దించారు. 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన చనాకా కొరాట బరాజ్ బీఆర్‌ఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యిందని గుర్తుచేశారు. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్‌తో కలిపి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రా మాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు.

2016లో మహారాష్ర్ట ప్రభుత్వంతో అంతర్రాష్ర్ట ఒప్పందం కుదుర్చుకుని మొ దలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది అని వెల్లడించారు. సదర్మట్ బరాజ్ నీటి నిల్వ సా మర్థ్యం 1.58 టీఎంసీలు కాగా కేసీఆర్ హయాంలోనే 90 శాతం ప్రాజెక్టు పూర్తయ్యిందని, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దశాబ్ది (2014--2023) నెర్రెలు బారిన ఈ నేలను దేశానికి ధాన్యాగారంగా మార్చిందని స్పష్టం చేశారు. 

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న రాహుల్, రేవంత్

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న రాహుల్- రేవం త్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ, తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటిచెప్పిందని విమర్శిం చారు. గురువారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. గతంలోనూ ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడకుండా అడ్డు పడిన అప్రజాస్వామిక శక్తులే ప్రస్తుతం కూడా రాజ్యాంగ విలువలకు నిలువునా పాతరేశాయని మండిపడ్డారు.

పార్టీ మారినట్టు కళ్లముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తు న్నా, ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనని, కాం గ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపైనా కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్‌కు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందని ఈ తీర్పు తేటతెల్లం చేస్తోందన్నారు. గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపా డేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనం లేదని తెలిపా రు. ప్రజాతీర్పును అవమానించిన జంప్ జిలానీలకు, ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు.