calender_icon.png 17 November, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పిల్లల పంపిణీ

17-11-2025 10:05:58 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద సోమవారం ప్రభుత్వం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తొంగలమల్లేష్, బత్తుల రవి, భామండ్లపల్లి భరత్ తదితరులు పాల్గొన్నారు.