05-08-2025 06:17:49 PM
తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి
తుంగతుర్తి,(విజయక్రాంతి): సమాజంలో ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సంతోష్ ప్రైవేట్ దవాఖానాలో సూర్యాపేట జిల్లా మాజీ గవర్నర్ కోనేరు నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని ప్రస్తుత గవర్నర్ రేపాల మదన్మోహన్ ఆదేశాల మేరకు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా పేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.