05-08-2025 06:21:33 PM
బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
వర్ధన్నపేట,(విజయక్రాంతి): వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చీమల బిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహించిన "ఇంటింటికి బిజెపి - ప్రతి గడప గడపకి బూత్ అధ్యక్షుడు" 'మహా సంపర్క్ అభియాన్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా "బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్" పాల్గొని గ్రామీణ వికాసం బిజెపితొనే సాధ్యం అనే నినాదంతో గడప గడపకు వెళ్లి 11 ఏళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తెలంగాణలో మార్పురాలే, బతుకులు మారలే అని, కాంగ్రెస్, బిఆరెస్ దొందూ దొందే అని, అవినీతికి కంచుకోట కాంగ్రెస్, అవినీతిపై కట్టిన కోట బీఆరెస్, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసిన కాంగ్రెస్ తమ పదవికాలం ముగిసినా, ఇంకా పెండింగ్ బిల్లులు కోసం నిరీక్షిస్తున్న సర్పంచులు. కాంగ్రెస్ నాయకుల అనుచరులకే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తూ,విద్యుత్ కోతలు, అసంపూర్ణ ధాన్య సేకరణ, కౌలు రైతు భరోసా లేకపోవడంతో అన్నదాతల అష్టకష్టాలు అవుతున్నారన్నారు. 2500- ఆర్ధిక సాయం, ఉచిత స్కూటీలు, కల్యాణలక్ష్మి తులం బంగారం కోసం ఆడబిడ్డల ఎదురుచూపులు. గ్రామీణ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ అని ఆయన అన్నారు.
సాగు చేసే రైతు బాగు కోరుతూ 31.2 లక్షల మందికి పెట్టుబడి సాయం అంధిచింది బిజెపి. అన్నదాతపై ఎరువుల భారం తీరుస్తూ 40,000 ల కోట్ల సబ్సిడీలు అంధిచిన బిజెపి. పండించిన ప్రతి గింజను కొంటూ వరి ధాన్య సేకరణపై 11ఏళ్లలో రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చిచింది బిజెపి. అంత్యోదయ లక్ష్యంతో 5.67 లక్షల కుటుంబాలకు చెందిన 1.9 కోట్ల మంది లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసి అందరి ఆకలి తీర్చింది బిజెపి అని,గ్రామీణ జీవనోపాధి మెరుగుపర్చడం కోసం 56 లక్షల మందికి పని కల్పించి 22,000/- కోట్లు వెచ్చించింది బిజెపి. చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలతో సాకరమైన మహిళా సాధికారత వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి గ్రామభివృద్ధికి తోడ్పడుతుదన్నారు.బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, మీ గ్రామం అభివృద్ధికి తొడ్పాటు అందించాలని అన్నారు.