calender_icon.png 20 November, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ

20-11-2025 12:04:12 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, నవంబర్ 19 (విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపి ణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మహిళా చీరల పంపిణీ పై అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో మహిళా సంఘాలకు సభ్యులైన ప్రతి మహిళతో పాటు 18 ఏళ్లు నిండిన అన్ని మహిళలకు చీరలు అందేలా విభాగాలు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

జిల్లాకు 1,70,331 చీరలు కేటాయించగా, అందులో 1,14,681 చీరలు చేరుకున్నాయని, మిగతా 55,650 చీరలు త్వరలోనే అందనున్నాయని తెలిపారు. చీరలను సురక్షితంగా నిల్వ చేయాలని, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9లోపు పంపిణీ పూర్తి చేసి, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 8 వరకు కార్యక్రమం నిర్వహించాలన్నారు.

చీరలు పొంది న మహిళల వివరాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహి ళా శక్తి భవనాన్ని త్వరలో పూర్తిచేయనున్న ట్లు తెలిపారు. పెట్రోల్ బంకుల నిర్మాణానికి అనువైన స్థలాలను వెంటనే గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్, కుమార్ కుమార్, జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, ఏపీడీ చరణ్ దాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.