calender_icon.png 20 November, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టెమ్స్‌పార్క్ రెజొనెన్స్ విద్యార్థుల యాత్ర

20-11-2025 12:04:15 AM

ఎడ్యుకేషనల్ ట్రిప్ నిర్వహించిన యాజమాన్యం

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీ స్టెమ్స్ పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యక్ష అభ్యసన అనుభవాలు కల్పించుటకు యాజమాన్యం ఫీల్డ్ ట్రిప్‌లను నిర్వహించింది. విద్యార్థులకు పాడి పరిశ్రమ, పాలఉత్పత్తి, నిల్వచేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించుటకు తెలంగాణ విజయ డెయిరీ కేంద్రాన్ని సందర్శించారు.

విద్యార్థులు పాల ఉత్పత్తి కేంద్రములోని వివిధ విభాగాలను, యంత్ర సామగ్రిని ప్రత్యక్షంగా చూస్తూ పాల నుంచి వివిధ రకాల పదార్థాలు ఎలా ఉత్పత్తి చేయబడతాయో అనుభూతిని పొం దారు. స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులల్లో శాస్త్రీయ దృ క్పథాలను పెంపొందించుటకు ఫీల్ ట్రిప్స్ ఉపయోగపడతాయని చెప్పారు. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి డిప్యూటి డైరెక్టర్ కె.రవికుమార్, జూనియర్ ఇంజనీర్ నాగమణి విద్యార్థులకు డెయిరీలోని వివిధ అం శాల గురించి వివరించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.వి.ఆర్.మురళీమోహన్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.