29-08-2025 12:56:09 AM
మేడ్చల్, ఆగస్టు 28(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేస్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందన్నారు. విడుదలవారీగా డబ్బులు విడుదలవుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రమేష్, మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, వేముల శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్లు మణికంఠ, మల్లేష్ గౌడ్, కౌడే మహేష్, చాపరాజు, దేవా, మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగురాజు తదితరులు పాల్గొన్నారు.