calender_icon.png 25 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

25-11-2025 05:34:33 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని లక్కారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం సెర్ప్ సిసి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి లబ్దిదారుకు చేరేలా అధికారుల సహాయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్లపల్లి విష్ణువర్ధన్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కుమారస్వామి, నాయకులు తాళ్లపల్లి చంద్రమౌళి, రాజయ్య, రాంబాబు, హరీష్, జే జంగాపల్లి, సత్యనారాయణ, రూపేష్, బత్తిన్ రవి, మొగిలి, రమేష్, గడ్డం సత్యనారాయణ, పంజాల, సమ్మయ్య, మాదాసి శ్రీకాంత్, వివో ఓబీ, విఓఏలు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.