31-12-2025 07:52:23 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక సహకార సంఘంకు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హైదరాబాద్ నుండి వై , సుచరిత జె డి ఏ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ పైలెట్ ప్రాజెక్టు గురించి పెద్దపల్లి జిల్లాకు బుధవారం రావడం జరిగింది. యూరియా బుకింగ్ యాప్ గురించి రైతుల వద్ద నుండి అభిప్రాయం సేకరించడం జరిగింది. రైతులు మాట్లాడుతూ ఈ యూరియా బుకింగ్ యాప్ రైతులకు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పడం జరిగింది.
ఇదివరకు మన జిల్లాలో గాని, మండలంలో గాని ఎక్కడ యూరియా స్టాక్ ఉందో రైతులకి తెలుసుకోవడం కష్టతరంగా ఉండేది. ఈ యాప్ ద్వారా ఇంటి దగ్గర నుంచి జిల్లా మొత్తంలో ఏ మండలంలో ఏ డీలర్ షాపులో, ఏ సొసైటీలో యూరియా అందుబాటులో ఉందో తెలుసుకొని రైతుకి దగ్గర్లో ఉన్న సొసైటీ లేదా డీలర్ షాపు వద్ద బుక్ చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా రైతులకు సమయం వృధా కాకుండా ఇంటి దగ్గర నుంచి యూరియా బుక్ చేసుకుంటున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.