31-12-2025 07:46:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రామీణ పేద ప్రజల ఆరోగ్యం కోసం స్థానిక ఆసుపత్రిలో క్షయ వ్యాధిని గుర్తించేందుకు ఏర్పాటుచేసిన ఎక్స్రే కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యంత్రం లేకపోవడం వల్ల క్షయ వ్యాధి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్ ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు గోపాల్ సింగ్ పాల్గొన్నారు