calender_icon.png 29 October, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లను వేగంగా పూర్తి చేయండి

25-10-2025 06:13:19 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తిచేస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పలువురు ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆయా మండలాలవారిగా ఆయా దశల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని చెప్పారు. అనుమతులు లభించిన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఇండ్ల నిర్మాణ పనులను ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి ఇసుక, ఇతర ముడి పదార్థాల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దశలవారీగా నిర్మాణ పనులు సంబంధిత అప్లికేషన్ లో పొందుపరుస్తూ ఉండాలని తెలిపారు. అంతకుముందు ఐసిడిఎస్ అధికారులతో సదరం క్యాంప్ అధికారులతో దివ్యాంగులకు ఐడి కార్డుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.