21-05-2025 01:15:57 AM
బాన్సువాడ మే 20 (విజయక్రాంతి) : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 113 మందికి ముఖ్యమంత్రి సహాయ నిది (సి ఎం ఆర్ ఎఫ్) లబ్ధిదారులకు రూ.42,40,500/ చెక్కులను, 77 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.77,08,880/- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని పంపిణీ చేశారు.
బాన్సువాడ గ్రామీణ మండలం 20 మంది సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ6,49,500/, బాన్సువాడ మున్సిపాలిటీ 6 గురు సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ2,24,000/-, బిర్కూర్ మండలం 11 మంది సి ఎమ్ ఆర్ ఎఫ్, లబ్ధిదారులకు రూ4,00,000/- , నసురుల్లబాద్ మండలం 11 మంది సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్దిదారులకు రూ3,78,500/-, కోటగిరి మండలం 13 మంది సిఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ5,67,000/-, పోతంగల్ మండలం 21 మంది సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ8,25,000/-, రుద్రూర్ మండలం 10 మంది సి ఎమ్ ఆర్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ3,01,000/-, వర్ని మండలం 08 మంది సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ 3,00,000/-, చందూర్ మండలం 03 మంది సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ1,54,000/-, మోస్రా మండలం 9 మంది సి సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ3,97,000/-, ఇతరులు ఒక్కరికి 44,500/-, మొత్తం నియోజక వర్గం లో 113 మంది సి ఎమ్ ఆర్ ఎఫ్ లబ్ధిదారులకు రూ42,40,500/ అందజేశారు.
మండలాల వారిగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారుల వివరాలు కోటగిరి మండలం 41 మంది కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకురూ41,04,756/, వర్ని మండలం 29 మంది కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకురూ29,03,312/, రుద్రురు మండలం 07 మంది కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు రూ7,00,812/, మొత్తం 77 మంది కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు రూ 77,08,880/-అందజేశారు.