calender_icon.png 22 May, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు రోజులు ఎల్లో అలర్ట్

21-05-2025 01:13:39 AM

మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర తగ్గుతాయని అధికారులు తెలిపారు.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. 23, 24 తేదీల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు. 25న ఎలాంటి హెచ్చరికలు లేకున్నా ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.