13-09-2025 05:00:28 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలో వలస ఆదివాసీలు నివాసం ఉంటున్న చింతకుంట గ్రామ ప్రజలకు శనివారం అశ్వాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి పాల్గొని గ్రామస్తులకు దోమ తెరలను అందజేశారు. ఆయనతోపాటు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.