calender_icon.png 27 January, 2026 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలకు బహుమతుల పంపిణీ

27-01-2026 01:48:56 AM

వరంగల్, జనవరి 26: గణతంత్ర దినోత్సం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి బహుమతులు అందజేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలపెల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల,ప్రైమరీ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఎస్‌ఆర్‌ఎస్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పరుపాటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బరిగాల బాబు, మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి,రాయపర్తి బీఆర్‌ఎస్ మండల నాయకులు లేతకుల రంగా రెడ్డి, గజవెల్లి ప్రసాద్, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, కోలా సంపత్, సంకినేని ఎల్లస్వామి, చిలువేరు సాయి గౌడ్ ,పెద్దగోని జీవన్ ఐత రవి, స్థానిక నాయకులు గుడి మైబురెడ్డి, దొకుడు సొమెందర్, బాషబోయిన ఎల్లయ్య, వశపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.